కాంగ్రెస్ పాలిత తెలంగాణలో విద్యా జిహాద్: రాంచందర్ రావు

by Malleboina Mahesh |   (  Updated:2026-07-16 06:25:04  IST  )

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సైదాబాద్ స్కూల్ హోంవర్క్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగింపు రాజకీయాలే కారణమంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలిత తెలంగాణలో విద్యా జిహాద్: రాంచందర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని పాత బస్తీలో సైదాబాద్‌లో ఒక పాఠశాలలో, 2వ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థినిని కల్మా పఠించి, వ్రాయమని టీచర్ చెప్పడం సంచలనంగా మారింది. హిందువుల పిల్లలకు ఇచ్చిన హోంవర్క్‌లో కల్మా, సూరా అల్-ఫాతిహా నేర్చుకోమని ఉండటంతో విద్యార్థిని తల్లి యాజమాన్యాన్ని నిలదీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వివాదంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆయన ట్వీట్‌లో " ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనికి మీరే బాధ్యులు. మీ బుజ్జగింపు రాజకీయాలు, “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” వంటి ప్రకటనలే ఇలాంటి తీవ్రవాద శక్తులకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. 2వ తరగతి పిల్లలను కల్మా వ్రాయమని బలవంతం చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత పాఠశాలను నిలదీసిన ఆ బాలుడి తల్లి ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ ఘటన తీవ్రత ఉన్నప్పటికీ, పాఠశాల యాజమాన్యంపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విద్యార్థులు, వారి కుటుంబాల పట్ల తనకున్న పూర్తి నిర్లక్ష్యాన్ని బయటపెడుతూ కళ్ళు మూసుకుంది. భారతీయ జనతా పార్టీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించడమే కాకుండా, తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది" అని రాంచందర్ రావు రాసుకొచ్చారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం: బండి సంజయ్

పాతబస్తీలో ప్రైవేట్ స్కూల్‌లో మతపరమైన బోధనలు.. ఖురాన్ చదవాలంటూ హోం వర్క్

Next Story