- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేష్ కనగరాజ్ ‘DC’ సినిమాకు సెన్సార్ షాక్.. A సర్టిఫికెట్‌తో విడుదల వాయిదా
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. కథలో ఉన్న విపరీతమైన యాక్షన్, వైలెన్స్ కారణంగానే ఈ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: లోకేష్ కనగరాజ్ తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ దుమ్మురేపుతున్నారు. భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన హీరోగా మారబోతున్నాడు. ఫుల్ బిజీగా ఉన్న ఆయన, మొదటిసారి హీరోగా బిగ్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం ‘డీసీ’. ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాతో విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ క్రేజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మొదట ఈ సినిమాను జూలై 31న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది.
లోకేష్ కనగరాజ్ నటన ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మేకర్స్ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయని, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. కథలో ఉన్న విపరీతమైన యాక్షన్, వైలెన్స్ కారణంగానే ఈ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. జూలై 31న రావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు వారం రోజులు ఆలస్యంగా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. రిలీజ్ కాస్త వాయిదా పడినప్పటికీ, లోకేష్ కనగరాజ్ మార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు అరుణ్ మాతేశ్వరన్ యాక్షన్ తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
మహేష్ ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. ఆ తేదీన 'పోకిరి' మిడ్‌నైట్ షోలు






