మామూనూరు ఎయిర్‌పోర్టుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం:మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

by Jakkula.Mamatha |

మామూనూరు ఎయిర్‌పోర్టుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

మామూనూరు ఎయిర్‌పోర్టుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం:మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: మామూనూరు ఎయిర్‌పోర్టుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సదర్బంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. మామూనూరు ఎయిర్‌పోర్టు నిజాం కాలంలో నిర్మించబడింది.

మామూనూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం మాజీ మంత్రి కేటీఆర్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. ఉడాన్ పథకం సమయంలో కూడా కేంద్రంతో నిరంతరం చర్చలు జరిపిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిఎంఆర్ సంస్థతో కేటీఆర్ చర్చించి ముందుకు తీసుకెళ్లారు. 1.8 కి.మీ రన్‌వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3.8 కి.మీగా విస్తరించేందుకు రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Next Story