- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలి : వైరా ఏడీఏ
వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకొని, ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం లేకపోవడంతో వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ వైరా డివిజన్ ఏడీఏ టి. కరుణశ్రీ అన్నారు.

దిశ, ఏన్కూర్ : వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకొని, ఎల్‌నినో (El Niño) ప్రభావం కారణంగా వర్షపాతం లేకపోవడంతో వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయంగా పెసర, మినుము, కంది, జొన్న, సజ్జ, ఆముదం పంటలపై మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ వైరా డివిజన్ ఏడీఏ టి. కరుణశ్రీ అన్నారు.
గురువారం ఏన్కూర్ మండలంలోని గార్లఓడ్డు, నూకాలంపాడు తదితర గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూగర్భ జలాల పెంపు కోసం రైతులు పంట కుంటలు తవ్వించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఐదు ఎకరాల లోపు భూమి కలిగి, జాబ్ కార్డు ఉన్న ప్రతి రైతు 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు, 2 మీటర్ల లోతుతో పంట కుంటలు తవ్వించుకోవచ్చని తెలిపారు.
ఈ పథకం కింద ఫార్మ్ పాండ్ నిర్మాణానికి రూ.96 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు అంచనా వ్యయం ఉంటుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ఏవో నరసింహారావు, ఏఈఓ భూక్య లహరి, సఫావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు.






