మమతా బెనర్జీకి మరో ఝలక్.. రాజ్యసభ సభ్యత్వానికి రుక్మిణి మల్లిక్ రాజీనామా

by Kema Shiva Kumar |

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.

మమతా బెనర్జీకి మరో ఝలక్.. రాజ్యసభ సభ్యత్వానికి రుక్మిణి మల్లిక్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి ఊహించని షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రుక్మిణి మల్లిక్ (Rukmini Mallik) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ ఆమె తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపించారు. తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, దీనిని తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆమోదించవలసిందిగా ఆమె తన లేఖలో పేర్కొన్నారు. అయితే, రాజీనామా లేఖలో రుక్మిణి మల్లిక్ భావోద్వేగంగా స్పందించారు. తన పదవీ కాలంలో తనకు ఎంతో అండగా నిలిచిన రాజ్యసభ చైర్మన్, గౌరవ డిప్యూటీ చైర్మన్‌లతో పాటు రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులకు, సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో వారు అందించిన సహాయ సహకారాలు, మద్దతును ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.

కాగా, రుక్మిణి మల్లిక్ హఠాత్తుగా తన రాజీనామా చేయడానికి గల రాజకీయ కారణాలు ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఆమె రాజీనామాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన మొత్తం 20 మంది లోక్‌సభ ఎంపీలు రెబల్ వర్గంగా విడిపోయిన విషయం తెలిసిందే. తిరుగుబాటు ఎంపీలు తమ వర్గాన్ని ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI)లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు.

Next Story