మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

by Batti.Sumithra |

ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు.

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ
X

దిశ, టేకులపల్లి : ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. ఈ ఘటన మండల పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామానికి చెందిన భానోత్ భద్రు, సుజాత దంపతులు బుధవారం రాత్రి ఆరుబయట నిద్రించారు. గురువారం తెల్లవారుజామున ముగ్గురు దుండగులు హెల్మెట్లు ధరించి బైక్పై వచ్చారు. సుజాత మెడలో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి ఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Next Story