- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో బోటు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మత్య్సకారులు
విశాఖ తీరంలో పెను ప్రమాదం తప్పింది. మత్స్యకారుల బోటు బోల్తా పడింది. అయితే ఈ ఘటన నుంచి ఏడుగురు మత్య్సకారులు సురక్షితంగా బయటపడ్డారు. విశాఖపట్నం సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు బయల్దేరివెళ్లారు..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ తీరం(Visakha Coast)లో పెను ప్రమాదం తప్పింది. మత్స్యకారుల బోటు(Fishermen boat) బోల్తా పడింది. అయితే ఈ ఘటన నుంచి ఏడుగురు మత్య్సకారులు సురక్షితంగా బయటపడ్డారు. విశాఖపట్నం సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేట(Fishing)కు బయల్దేరివెళ్లారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలోవీరు ప్రయాణిస్తున్న బోటు సముద్రపు అలలు దాటికిబోల్తా పడింది. అయితే సముద్రంలో మునిగిపోతున్న వారిని గమనించిన తోటి మత్స్యకారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దీంతో మత్స్యకారులందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
మత్స్యకారుల్లో ఇద్దరికి గాయాలు
అయితే ఒడ్డుకు చేర్చిన మత్స్యకారుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలల తాకిడికి బోటు భాగాలు తగిలాయి. దీంతో వారికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మత్స్యకారులకు సుమారు రూ. 4.5 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇటీవల సముద్రంలో బోటు బోల్తా పడి మత్య్సకారులు మృతి చెందిన ఘటన మర్చిపోకముందే మరో ఘటన జరగడంతో స్థానికంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలు, అలల ఉద్ధృతి పెరిగినప్పుడల్లా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.






