- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన తహసీల్దార్ శ్రీనివాస్
by Jakkula.Mamatha |
చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తహసీల్దార్ శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు.

X
దిశ, చిన్నంబావి: చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తహసీల్దార్ శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత పై ఆరా తీశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న డిజిటల్ బోధన విధానాన్ని పరిశీలించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యా బోధన చేస్తున్నందుకు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ రాముడు, ఉపాధ్యాయుడు మధు, ఫ్రీ ప్రైమరీ టీచర్ భవాని, ఆయా సునీత, వాలంటీర్ శ్రీ విద్య, గ్రామ పాలన అధికారి రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Next Story






