HYD: వర్షంలోనూ బోనాలు సమర్పిస్తున్న భక్తులు

by Gantepaka Srikanth |

భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర కోలాహలం అంబరాన్నంటింది. చారిత్రాత్మక గోల్కొండ కోట పరిసరాల్లో గురువారం భారీ వర్షం కురిసింది.

HYD: వర్షంలోనూ బోనాలు సమర్పిస్తున్న భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర కోలాహలం అంబరాన్నంటింది. చారిత్రాత్మక గోల్కొండ కోట పరిసరాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. అయితే, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. తలపై బోనమెత్తి, వర్షంలో తడుస్తూనే భక్తజనం అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో తరలివచ్చారు. మరోవైపు పాతబస్తీలోని లాల్దర్వాజా నుంచి గోల్కొండ కోట వైపు సాగిన ఘటాల ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. పోతురాజుల విన్యాసాలు, తీన్మార్ డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపు మార్గమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. లాల్దర్వాజా పరిసరాల నుంచి గోల్కొండ వైపు భక్తులు భారీగా తరలిరావడంతో దారులన్నీ భక్తజన సందోహంగా మారాయి. వర్షం పడుతున్నా జాతర ఉత్సాహం ఏమాత్రం తగ్గకపోగా, డప్పుల శబ్దాల మధ్య భక్తుల కోలాహలంతో గోల్కొండ కోట ప్రాంతం మార్మోగిపోయింది.

Next Story