- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినోద్ చారి పై దాడికి నిరసనగా బీజేపీ ధర్నా
చందంపేట మండల బీజేపీ అధ్యక్షుడు వినోద్ చారి పై జరిగిన దాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం చందంపేట మండలంలోని పోలేపల్లి ఎక్స్‌రోడ్ బస్టాండ్ ఎదురుగా భారీ ధర్నా నిర్వహించారు.

దిశ, చందంపేట : చందంపేట మండల బీజేపీ అధ్యక్షుడు వినోద్ చారి పై జరిగిన దాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం చందంపేట మండలంలోని పోలేపల్లి ఎక్స్‌రోడ్ బస్టాండ్ ఎదురుగా భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కేతావత్ లాలూ నాయక్ మాట్లాడుతూ, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్య విలువల పై దాడులతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింస, బెదిరింపులు, గూండాయిజానికి స్థానం లేదని స్పష్టం చేశారు. చందంపేట మండల అధ్యక్షుడు వినోద్ చారిపై జరిగిన దాడి అత్యంత ఖండనీయమని పేర్కొంటూ, దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుని బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజా సమస్యల పై బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, బెదిరింపులు, దాడులతో కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదని నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ కన్వీనర్ నక్క వెంకటేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వానం నరేందర్ రెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వినోద్ రాథోడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాకీ నరసింహ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చివర్ల రమేష్, ధార్మిక సెల్ కో-కన్వీనర్ వనం సుజాత, సీనియర్ నాయకులు బెజవాడ శేఖర్, చెనమోని రాములు, వనం పుష్పలత, ఏటి కృష్ణ, మండల అధ్యక్షులు భరత్ గౌడ్, నేనావత్ రాము నాయక్, వినోద్ చారి, ఎర్ర బిక్షపతి, నాగిళ్ల ఆంజనేయులు, సముద్రాల నగేష్, రామలింగం, గోలి శ్యామ్‌తో పాటు వివిధ మోర్చాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినోద్ చారికి సంఘీభావం తెలిపారు.






