15 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్‌కార్డ్ వేసిన స్టార్ కపుల్.. కీలక నోట్ విడుదల

by Mallepaka Hamsa |

భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ, తమ ముద్దుల కుమార్తె 'జిజా' పట్ల తమకున్న బాధ్యత, అంకితభావం ఎప్పటికీ అలాగే ఉంటాయని స్పష్టం చేశారు.

15 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్‌కార్డ్ వేసిన స్టార్ కపుల్.. కీలక నోట్ విడుదల
X

దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీల విడాకులు కామన్ అయిపోయాయి. చిన్న చిన్న గొడవలకే ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక తల్లిదండ్రులుగా వారికి అండగా ఉండకుండా.. ఏవో కారణాలతో విడిపోతున్నారు. తాజాగా, మరో జంట తమ 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. ప్రముఖ నటుడు అద్దినాథ్ కొఠారే, స్టార్ హీరోయిన్ ఊర్మిళా కనేట్కర్ విడాకులు ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చాలా ఆలోచించిన తర్వాతే తాము స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ జంట తెలిపారు. భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ, తమ ముద్దుల కుమార్తె 'జిజా' పట్ల తమకున్న బాధ్యత, అంకితభావం ఎప్పటికీ అలాగే ఉంటాయని స్పష్టం చేశారు.

తమ కుమార్తెకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ప్రేమ, భద్రతతో కూడిన వాతావరణంలో ఆమెను కలిసికట్టుగా పెంచుతామని చెప్పారు. తమ మధ్య గడిచిన ఆ సంతోషకరమైన సంవత్సరాల పట్ల, ఒకరిపై ఒకరికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇన్నాళ్లు తమను ఆదరించిన మీడియాకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ సమయంలో అందరి ఆశీస్సులు కావాలని కోరారు. అలాగే తమ వ్యక్తిగత ప్రైవసీని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విడాకుల విషయమై ఇదే తమ చివరి ప్రకటన అని, దీనిపై తాము ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు జీజాను కలిసికట్టుగా పెంచడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story