సొంత కంటెంట్ కోసం జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-16 11:09:42  IST  )

సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ తొలగిస్తున్నారని, అందుకే సొంతంగా ఒక యాప్ తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ..

సొంత కంటెంట్ కోసం జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ తొలగిస్తున్నారని, అందుకే సొంతంగా ఒక యాప్ తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు. జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని యాప్‌లో చెప్పుకోవచ్చన్నారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్ ఉండేలా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు ఇందులో చెప్పుకోవచ్చన్నారు. తమపై పెట్టిన కేసుల వివరాలు సైతం కార్యకర్తలు పంచుకోవచ్చని చెప్పారు. వేధింపులకు గురైన వారు యాప్‌లో వివరాలు తెలపవచ్చని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Next Story