ఓటరు జాబితా పై అప్రమత్తంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

by Batti.Sumithra |

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆత్మకూరు(ఎం), గుండాల, మోటకొండూరు మండలాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ (బీఎల్‌ఏలు)తో మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఓటరు జాబితా పై అప్రమత్తంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
X

దిశ, ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆత్మకూరు(ఎం), గుండాల, మోటకొండూరు మండలాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ (బీఎల్‌ఏలు)తో మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితా పై పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చూడడంతో పాటు, జాబితాలోని లోపాలను గుర్తించి సరిదిద్దే ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అన్నారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్, సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్, మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు ఖలీల్, జిల్లా నాయకుడు బిక్షపతి, పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story