- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది.

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. కార్యాలయంలోని కంప్యూటర్ గది పైకప్పు ఒక్కసారిగా పెచ్చులూడి కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న టైపిస్ట్ మల్లికార్జున్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం ప్రకారం.. పైకప్పు కూలిపోవడానికి ముందు చిన్న పెచ్చు ముక్క ఊడి పడటాన్ని గమనించిన మల్లికార్జున్ అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. వెంటనే పెద్ద మొత్తంలో పైకప్పు కూలిపోవడంతో భారీ శబ్దం వినిపించింది. దీంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఒక్కసారిగా ఆ గది వద్దకు చేరుకుని ఏం జరిగిందో తెలుసుకునేందుకు పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గదిలో ఉన్న కుర్చీలు ధ్వంసమయ్యాయి. శిథిలావస్థకు చేరుకున్న తహసీల్దార్ కార్యాలయ భవనం ఎప్పుడైనా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు, కార్యాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనం మరమ్మతులు చేపట్టి, భద్రతా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.






