Jagapathi Babu: సినిమా ఫంక్షన్స్ బోర్.. వాళ్ళని పొగడడం నావల్ల కాదు

by Pulgam srinivas |

సినిమా ఫంక్షన్లలో లేనిపోని పొగడ్తలు చెప్పడం నా వల్ల కాదని జగపతిబాబు అన్నారు.

Jagapathi Babu: సినిమా ఫంక్షన్స్ బోర్.. వాళ్ళని పొగడడం నావల్ల కాదు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి విషయమైనా ఉన్నది ఉన్నట్లుగా, నిస్సందేహంగా మాట్లాడే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమా ఈవెంట్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జగపతిబాబు మాట్లాడుతూ... సినిమా ఫంక్షన్లు నాకు చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. అవి దాదాపు మూడు గంటలకు పైగా సాగుతుంటాయి. ఈవెంట్‌లో పాటలు, ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ అక్కడ నిజం మాట్లాడితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే చాలాసార్లు లేనిపోని పొగడ్తలు చెప్పాల్సి వస్తుంది.

అలా మాట్లాడటం నా వల్ల కాదు. అది నా ముఖంలోనే కనిపిస్తుంది. అందుకే నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా 'ఇతను రాకపోతే బాగుంటుంది' అనుకుంటారేమో అనిపిస్తుంది. నాకు సినిమా ఫంక్షన్లు అంతగా నచ్చవు. అక్కడ మాకు పెద్దగా ప్రాధాన్యం కూడా ఉండదు. ఊరికే ఒక ప్రాపర్టీలా కూర్చోబెడతారని అన్నారు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక జగపతిబాబు తాజాగా 'వదలా' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో లయ కథానాయికగా నటించింది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story