- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కష్టపడిన కార్యకర్తను కాంగ్రెస్ ఎప్పటికీ మరవదు: మంత్రి సీతక్క
పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించే కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలమని, కష్టపడి పనిచేసిన వారిని కాంగ్రెస్ ఎప్పటికీ మరవదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

దిశ, కొత్తగూడ : పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించే కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలమని, కష్టపడి పనిచేసిన వారిని కాంగ్రెస్ ఎప్పటికీ మరవదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. అంకితభావంతో పనిచేసిన వారికి సముచిత గుర్తింపు, బాధ్యతలు తప్పక దక్కుతాయని పేర్కొన్నారు. కొత్తగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన బానోత్ రూప్‌సింగ్, గంగారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన ముడిగ వీరభద్రలను గురువారం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి సీతక్క శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదవి అనేది కేవలం హోదా కాదని, ప్రజలకు, పార్టీకి మరింత బాధ్యత అని అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలను కలుపుకుని ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కొత్తగా నియమితులైన అధ్యక్షులకు సూచించారు. రూప్‌సింగ్, ముడిగ వీరభద్ర ఇద్దరూ ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ కార్యకర్తలతో మమేకమయ్యారని, వారి సేవలను గుర్తించడం పార్టీ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు.
సన్మానం అనంతరం రూప్‌సింగ్, ముడిగ వీరభద్ర మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యంగా మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా నారాయణరెడ్డి, సుంకరబోయిన మొగిలి, బిట్ల వేణు, ప్రశాంత్, ముడిగ విజయ్, బుర్కా నరేందర్, వెల్డండి వేణు, ముడిగ పోతయ్య, విజయ్‌తో పాటు కొత్తగూడ, గంగారం మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






