- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్దెకుండే వారికి అడ్వాన్సుల భారం.. HYDలో రూ.6,843 కోట్లు యజమానుల వద్ద లాక్
ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ల కింద రూ.లక్ష కోట్లపైగా ఓనర్ల వద్ద లాక్ అయినట్లు తాజాగా నో బ్రోకర్ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇండ్లు అద్దెకు తీసుకునే వారిపై సెక్యూరిటీ డిపాజిట్ల భారం భారీగా పడుతోంది. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై, పుణె వంటి టాప్ 6 మెట్రో నగరాల్లో అద్దెదారులు ఇళ్ల యజమానుల వద్ద ఏకంగా రూ. 1.26 లక్షల కోట్లను సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో దాచారని ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ 'నోబ్రోకర్' (NoBroker) తన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్ లో రూ.6,843 కోట్లు:
సర్వే చేసిన నగరాల్లో ముంబయిలో అత్యధికంగా రూ. 41,156 కోట్లు, బెంగళూరులో రూ. 31,628 కోట్లు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రూ.24,054 కోట్లు, చెన్నైలో రూ.17,346 కోట్లు, హైదరాబాద్‌లో రూ.6,843 కోట్లు, పుణేలో రూ.5,015 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో లాక్ అయి ఉన్నాయని తేలింది. అధిక సెక్యూరిటీ డిపాజిట్ల కారణంగానే తాము ఇష్టపడిన ఇళ్లల్లోకి మారలేకపోయామని బెంగళూరులోని 75 శాతం మంది అద్దెదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ లో 58 శాతం మంది అద్దెదారులకు లీజ్ ముగిసిన తర్వాత డిపాజిట్ సొమ్ము పూర్తిగా తిరిగి రాగా, 30 శాతం మందికి కొన్ని కటింగ్‌లు జరిగాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే అద్దెదారుల నెలవారీ బడ్జెట్‌లో అద్దె అనేది అతిపెద్ద ఖర్చుగా మారిందని ఈ అధ్యయనం తేల్చింది. దాదాపు సగం మంది అద్దెదారులు తమ నెలవారీ ఆదాయంలో 30 శాతానికి పైగా అద్దెలకే ఖర్చు చేస్తున్నారని, ముఖ్యంగా ముంబయిలో 25 శాతం మంది అద్దెదారులు తమ సంపాదనలో సగానికి పైగా (50% పైగా) అద్దెకే కేటాయిస్తుండగా.. మరో 15 శాతం మంది 41-50 శాతం లోపు చెల్లిస్తున్నట్లు తేలింది.
ఇల్లు కొనడం మరింత కష్టంగా:
ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటమే నగరవాసులకు ఆర్థికంగా భారంగా మారిందని దీంతో సొంతింటి కల అందని ద్రాక్షలా మారిందని ఈ అధ్యయన నివేదిక పేర్కొంది. 2021 నుండి అద్దెకు, ఈఎంఐకి మధ్య ఉన్న వ్యత్యాసం సైతం మరింత పెరిగిందని స్పష్టం చేసింది. బెంగళూరులో ఈఎంఐ-అద్దె నిష్పత్తి 2.07 నుంచి 2.38కు, హైదరాబాద్‌లో 2.21 నుంచి 2.47కు, ముంబైలో 2.03 నుంచి 2.19కు పెరిగింది. దీంతో ఇల్లు కొనాలనుకునే వారు కూడా తప్పనిసరిగా అద్దె ఇళ్లలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంది.
మారుతున్న అద్దెదారులు ధోరణి జెన్ జీ ట్రెండ్:
పాత తరంతో పోలిస్తే 'జెన్ జీ' (Gen Z) అద్దెదారులు చాలా వేగంగా ఇళ్లను మారుస్తున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. 18-24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 30 శాతం మంది ప్రతి 6 నుండి 12 నెలలకోసారి ఇళ్లు మారుతున్నారని, 35 ఏళ్లు దాటిన వారిలో ఈ సంఖ్య 10 శాతం మాత్రమే ఉన్నారని, ఇక 55 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ మంది మూడు సంవత్సరాలకు పైగా ఒకే ఇంటిలో నివసిస్తున్నట్లు పేర్కొంది.
చిన్న ఇళ్లకే ఎక్కువ లాభం:
పెట్టుబడిదారుల కోణంలో చూస్తే.. పెద్ద ఇళ్ల కంటే 1BHK, స్టూడియో రూమ్‌ల వంటి చిన్న ఇళ్లే ఎక్కువ అద్దె రాబడిని అందిస్తున్నట్లు స్పష్టమైంది. ఇళ్ల పరిమాణం పెరిగే కొద్దీ ఈ రాబడి తగ్గుతోందని ఎక్కువ నగరాల్లో 4BHK ఇళ్లకు 3 శాతం కంటే తక్కువ రాబడి మాత్రమే లభిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. అద్దె రాబడిలో బెంగళూరు 4.8 శాతం, హైదరాబాద్ 4.6 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది.






