- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంబోతులా రంకెలేశారు: అంబటిపై బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు వద్ద జరిగిన పరిణామాలే చర్చనీయాంశంగా మారాయి..

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Kapu movement leader Mudragada Padmanabham) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు వద్ద జరిగిన పరిణామాలే చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాల్సి ఉంది. కానీ వైసీపీ నేత అంబటి రాంబాబు అడ్డుకోవడంతో కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడ జరిగిన పరిణామాలను మాత్రం టీడీపీ నేతలు తప్పుబట్టారు. ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరిగే సమయంలో అంబటి పెద్దపెద్దగా అరుస్తూ ఆపేయండని అడ్డుకున్నారు. బతికి ఉన్నప్పుడు అవమానించి.. ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే సీరియస్
దీంతో ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సీరియస్ అయ్యారు. అటు ముద్రగడ కూతురిని కూడా అంత్యక్రియలకు రానివ్వకపోడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంబోతులాగా అంబటి రాంబాబు రంకెలేశారని ధ్వజమెత్తారు. కూతురిని తండ్రి భౌతికకాయం దగ్గరకు రానివ్వకపోవడమేంటని ప్రశ్నించారు. జగన్ బయటకు వస్తేనే అల్లరి జరుగుతోందని ఆరోపించారు. హైప్ క్రియేట్ కోసం డ్రామాలు చేయడం అలవాటేనని విమర్శించారు. పరామర్శలకు సైతం ర్యాలీలు చేయడమేంటని బుచ్చయ్య చౌదరి నిలదీశారు.






