- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SKN: 'ది రాజా సాబ్'లో నా పాత్ర కేవలం దానికి మాత్రమే పరిమితం అయింది.
'ది రాజా సాబ్' సినిమా విషయంలో తన పాత్ర కేవలం స్పీచ్‌లకే పరిమితమైందని ఎస్‌కేఎన్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ చాలా సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. కొంతకాలం క్రితం ఆయన నిర్మించిన 'బేబీ' చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాల్లో ఎస్‌కేఎన్ స్పీచ్ లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, నిర్మాతగా ఆయనకు మరింత గుర్తింపు లభించింది. 'బేబీ' వంటి భారీ విజయం తర్వాత ఎస్‌కేఎన్ తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్‌గా తెరకెక్కిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. అలాగే కొంతకాలం క్రితం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజా సాబ్' సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎస్‌కేఎన్ చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు 'ది రాజా సాబ్' చిత్రంలో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఎస్‌కేఎన్ స్పందిస్తూ.. మారుతి నాకు చాలా మంచి స్నేహితుడు. మొదట ఈ సినిమాను మరో నిర్మాణ సంస్థలో చేయాలని అనుకున్నారు. తర్వాత బ్యానర్ మారింది.
ఆ సమయంలో 'బేబీ' సినిమా ఇంకా విడుదల కాలేదు కాబట్టి నేను ఖాళీగా ఉన్నాను. అయితే 'బేబీ' విడుదలై భారీ విజయం సాధించిన తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యాను. అందుకే 'ది రాజా సాబ్'లో నేను పేరుకు మాత్రమే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నాను. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఇతర విషయాల్లో నా ప్రమేయం పెద్దగా లేదు. ప్రధానంగా ప్రచార కార్యక్రమాల్లో స్టేజ్‌పై ప్రసంగాలు చేయడానికే నా పాత్ర పరిమితమైంది" అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. నా ప్రసంగాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందుకే 'ది రాజా సాబ్' ప్రచార కార్యక్రమాల్లో కూడా నా స్పీచ్‌లకు చిత్ర బృందం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందిని ఎస్‌కేఎన్ వెల్లడించారు.






