- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లికి నో చెప్పిందని లా విద్యార్థినిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి
బెంగుళూరులో ప్రేమించిన వ్యక్తి సోదరుడి చేతిలో దాడికి గురైన లా విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత అనే న్యాయ విద్యార్థిని కొంతకాలంగా ధనుష్ అనే యువకుడితో ప్రేమలో ఉంది.

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో ప్రేమించిన వ్యక్తి సోదరుడి చేతిలో దాడికి గురైన లా విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత అనే న్యాయ విద్యార్థిని కొంతకాలంగా ధనుష్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా అప్పటికే ధనుష్ కు పెళ్లై బిడ్డ కూడా పుట్టిందని కానీ విడాకులు అయ్యాయని తెలిసింది. దీంతో అమృత అతడిని నిలదీసి దూరం పెట్టింది. ధనుష్ ను పెళ్లి చేసుకునేందకు నిరాకరించింది. ఈ విషయం ధనుష్ సోదరుడిని తెలియడంతో అతడు కోడిహళ్లి ప్రాంతానికి వెళ్లి తన సోదరుడిని పెళ్లి చేసుకోవాలని అమృతను వేధించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో అమృతపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడ నుండి తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది.
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి






