- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓపెన్ ఏఐ మరో అద్భుతం.. స్క్రీన్‌లెస్ AI స్మార్ట్ స్పీకర్‌ను డెవలప్ చేసిన నిపుణులు
ఓపెన్ ఏఐ స్మార్ట్ స్పీకర్ స్క్రీన్ లేకుండానే కెమెరా, సెన్సార్లు, అలాగే మెకానికల్ భాగాలతో కలిసి పనిచేస్తుంది.

దిశ, ఫీచర్స్ : సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితమైన ఓపెన్ ఏఐ కొంతకాలంగా హర్డ్‌వేర్ రంగంపైనా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘స్ర్కీన్‌లెస్ స్మార్ట్ స్పీకర్’ పేరుతో తన మొదటి ఉత్పత్తిని అభివృద్ధి చేసింది. ఇది జోనీ ఐవ్ రూపొందించిన ప్రధాన డివైజ్ కాదు కానీ.. హ్యూమన్ లాంటి ఏఐ కంపానియన్‌గా పనిచేస్తుంది. వివిధ పనుల్లో యూజర్లకు సహకరిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఏఐ యుగంలో కొత్త రకం హోమ్ కంప్యూటర్‌గా వర్క్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ అదెలా పనిచేస్తుంది? ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాట్‌జీపీటీ సామర్థ్యాలతో వర్క్..
సాంకేతిక పరిశోధకులు డెవలప్ చేసిన స్క్రీన్‌లెస్ స్మార్ట్ స్పీకర్ చాట్‌జీపీటీ (ChatGPT) సామర్థ్యాలను ఉపయోగించి సహజంగా మాట్లాడుతుంది. స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం, మ్యూజిక్ వినిపించడం, మెసేజ్‌లు చదవడం, వంటలు లేదా ఇతర పనులు చేయడానికి సూచనలు ఇవ్వండి వంటివి చేయగలదని నిపుణులు అంటున్నారు. దీనిని ఒక గదిలో నుంచి మరో గదిలోకి, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంలోకి ఇలా ఎక్కడైనా ఈజీగా వెంటతీసుకెళ్లవచ్చు. కాగా ఈ స్పీకర్ ఓపెన్‌ఏఐ హార్డ్‌వేర్ లైనప్‌లో ప్రపంచంలోనే మొదటి ఉత్పత్తిగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ స్పీకర్ ఇంకా అభివృద్ధి దశలో ఉన్ననప్పటికీ, ఇటీవలి లీకులు దీని వివరాలను బయటపెట్టాయి. ఏఐ యుగంలో ఈ సరికొత్త ఉత్పత్తి మానవ మనుగడను మరింత సులభతరం చేయడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఎలా పనిచేస్తుంది?
ఓపెన్ ఏఐ హార్డ్‌వేర్ స్పీకర్ స్క్రీన్ లేకుండా, కెమెరా, సెన్సార్లు, అలాగే మెకానికల్ భాగాలతో పనిచేస్తుంది. చాట్‌జీపీటీ(GPT-Live వాయిస్ మోడ్)ని ఉపయోగించి సహజంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఇందులోని మెకానికల్ ఎలిమెంట్స్ ఆటోమేటిగ్గా కదులుతాయి. దీని వల్ల డివైజ్ ‘జీవంతో’ ఉన్నట్లు అనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది ప్రోయాక్టివ్‌గా (ముందుగానే) యూజర్ అవసరాలను గుర్తించి స్పందిస్తుంది. దీనిని ఎక్కడికి వెళ్లినా వెంటతీసుకెళ్లవచ్చు.
ఉపయోగాలు
*ఇంట్లో వ్యక్తులకు మరో తోడుగా.. అంటే ఏఐ సహచరుడిగా సంభాషించుకోవడానికి సహాయపడుతుంది.
*స్మార్ట్ హోమ్ పరికరాల నియంత్రణలో కీ రోల్ పోషిస్తుంది.
*సంగీతం వినిపించడం, సందేశాలు చదవడం వంటివి చేస్తుంది.
*వంట, పలు ఇతర పనుల్లో సహాయం చేస్తుంది.
*కెమెరా ద్వారా విజువల్ అవగాహనతో మరింత స్మార్ట్‌గా పనిచేయడం దీని ప్రత్యేకత.






