- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. ఆ తేదీన 'పోకిరి' మిడ్‌నైట్ షోలు
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' రీ-రిలీజ్‌కు మిడ్‌నైట్ షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ సిద్ధమవుతోంది. మహేష్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'పోకిరి' చిత్రాన్ని మరోసారి రీ-రిలీజ్ చేయనున్న నేపథ్యంలో, తొలిసారిగా రీ-రిలీజ్‌కు స్పెషల్ మిడ్‌నైట్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక మిడ్ నైట్ షోలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు మరోసారి థియేటర్లలో 'పోకిరి' మ్యాజిక్‌ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2006లో విడుదలైన 'పోకిరి' టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా గోవా బ్యూటీ ఇలియానా నటించగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ప్రకాశ్ రాజ్, నాజర్, ఆలీ, బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, మంజుల ఘట్టమనేని నిర్మాతలుగా వ్యవహరించారు.
'NBK111'లో నాది అలాంటి పాత్ర.. ఒక్క హింట్‌తో అంచనాలు పెంచేసిన కాజల్ అగర్వాల్






