- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'NBK111'లో నాది అలాంటి పాత్ర.. ఒక్క హింట్‌తో అంచనాలు పెంచేసిన కాజల్ అగర్వాల్
'NBK111' చిత్రంలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని కాజల్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, 'చందమామ', 'మగధీర' వంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అనంతరం తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పెళ్లికి ముందు ఎక్కువగా గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించిన కాజల్, వివాహం అనంతరం, అలాగే ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన సినిమాల ఎంపికలో పూర్తిగా మార్పు తీసుకొచ్చారు. ప్రస్తుతం గ్లామర్ కంటే పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలోనే కాజల్ తాజాగా 'ది ఇండియా స్టోరీ' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాజల్ మాట్లాడుతూ... "ఈ సినిమాలో నా పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఒకప్పుడు ఏడాదికి ఎనిమిది, తొమ్మిది సినిమాలు చేసేదాన్ని. కానీ ఇప్పుడు సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు చేసినా, పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటున్నాను" అని తెలిపారు. అలాగే ప్రస్తుతం బాలకృష్ణ గారితో చేస్తున్న సినిమాలో కూడా తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చెప్పింది. కాజల్ అలా చెప్పడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.






