- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాలను నిరంతరం పరిశీలిస్తూ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గురువారం హౌసింగ్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల్లో మంజూరైన ఇళ్లు, నిర్మాణ దశలో ఉన్న గృహాలు, పూర్తయిన ఇళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు లేని పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. గుడిసెలు, రేకుల షెడ్లలో నివసిస్తున్న నిజమైన అర్హులకే ఇళ్ల మంజూరు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏఈలు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులకు అవసరమైన సూచనలు అందిస్తూ నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణాల మంజూరు ప్రక్రియలో అలసత్వం ప్రదర్శించకుండా, రెండో దశలో నిర్మాణానికి ఆసక్తి ఉన్న అర్హులైన లబ్ధిదారులకు కూడా ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు. అనంతరం వన మహోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, జిల్లా వ్యాప్తంగా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు అందుబాటులో ఉంచడంతో పాటు ముందస్తుగా గుంతలు తవ్వించి సిద్ధంగా ఉంచాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీపీఓ జయశీలతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






