- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం విజయ్‌తో వరలక్ష్మి శరత్ కుమార్ భేటీ.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సెన్సేషనల్ పోస్ట్
మమ్మల్ని కలిసి, ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. గతంలో సర్కార్ సినిమా సెట్స్‌లో నేను ఆయనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా తలుచుకుని ఇద్దరం నవ్వుకున్నాం

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. "జనాలు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ అంతిమంగా చూస్తే సి. జోసెఫ్ విజయ్ మన ముఖ్యమంత్రి. ఆయన ఈ పదవిలో ఇక్కడే స్థిరంగా కొనసాగుతారు. ఎవరినైనా విమర్శించడం చాలా సులభం, కానీ మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడానికి అపారమైన ధైర్యం, పట్టుదల, అలాగే తమిళనాడు ప్రజల నుండి అపారమైన ప్రేమ అవసరం. అందుకే ఆ పదవిని మనం గౌరవించాలి" అని పేర్కొన్నారు. మాటల కంటే చేతలే గొప్పవని, నిరంతరం తప్పులు వెతికే వారికి కాలమే సమాధానం చెబుతుందని ఆమె స్పష్టం చేశారు.
విజయ్ ఏం సాధిస్తారో చూసేందుకు విమర్శకులు కాస్త ఓపిక, గౌరవం, ప్రోత్సాహం అందించాలని కోరారు. ఇక ముఖ్యమంత్రి విజయ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ.. "ఐ లవ్ యూ సార్, ఎప్పటికీ నేను విజయ్ అభిమానిగానే ఉంటాను. మమ్మల్ని కలిసి, ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. గతంలో సర్కార్ సినిమా సెట్స్‌లో నేను ఆయనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా తలుచుకుని ఇద్దరం నవ్వుకున్నాం. విజయ్ గారి ప్రయాణం ఇదేనని నాకు అప్పుడే అర్థమైంది. ఆయన ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా, వినమ్రంగా ఉంటారు" అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో కేవలం రాజకీయాలే కాకుండా, మహిళా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా చర్చించినట్లు వరలక్ష్మి వెల్లడించారు. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలో తమిళనాడు ప్రజల కోసం రాబోయే అద్భుతమైన మార్పులను చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. దేవుని ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని రాసుకొచ్చారు. అంతేకాకుండా ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోలను కూడా షేర్ చేశారు.






