- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంటు కోసం రైతుల రాస్తారోకో..
by Taduka Kalyani |
వ్యవసాయానికి 18 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం రెండు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదంటూ ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు.

X
దిశ, అక్బర్ పేట భూంపల్లి: వ్యవసాయానికి 18 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం రెండు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదంటూ ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. ఎల్ నినో ప్రభావంతో బోర్లు అడుగంటి పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన అక్బర్ పేట భూంపల్లి మండలం కాజీపూర్ లో గురువారం చోటు చేసుకుంది. ఇప్పటికే వర్షాలు లేక పంటల సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బోర్ల ద్వారా నీళ్లు పరిద్దామనుకుంటే అధికారులు కరెంటును సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇకనైనా 18 గంటల త్రీఫేస్ కరెంట్ ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
Next Story






