ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

కాజోల్ నా అత్యంత ఇష్టమైన నటీమణుల్లో ఒకరని దుల్కర్ సల్మాన్ తెలిపారు.

ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందిన నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన కేవలం మలయాళ చిత్రాలకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను దక్కించుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ తనకు అత్యంత ఇష్టమైన నటి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాకు అత్యంత ఇష్టమైన నటీమణుల్లో కాజోల్ ఒకరు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగి, ఇప్పటికీ అదే స్థాయిలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఎంతోమంది నటీమణులకు ఆమె ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆమెంటే నాకు ఎంతో అభిమానం. ఆమెతో కలిసి నటించే అవకాశం వస్తే ఎంతో ఆనందంగా స్వీకరిస్తానని తెలిపారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story