- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వైరా మేజర్ కాలువ కట్టను ఆక్రమించుకొని వేసిన ఫినిషింగ్ నీటిపారుదల శాఖ అధికారులు తొలగించారు.

దిశ, కొణిజర్ల: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వైరా మేజర్ కాలువ కట్టను ఆక్రమించుకొని వేసిన ఫినిషింగ్ నీటిపారుదల శాఖ అధికారులు తొలగించారు. ‘దిశ’ ఖమ్మం టాబ్లాయిడ్‌లో ఈనెల 9న ‘కాలువలే కదా కలిపేసుకుందాం’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. వైరా ఖమ్మం జాతీయ ప్రధాన రహదారి పక్కన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వైరా మేజర్ కాలువ కట్టను తొలిసి మరి ఆక్రమించాడు. అంతటితో ఆగకుండా తన సొంత ఆస్తి లాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. అక్రమం పై ‘దిశ’ పత్రికలో వచ్చిన కథనంతో అధికారులలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఫెన్సింగ్ కొంత మేర తొలగించినప్పటికీ పూర్తిస్థాయిలో తొలగించలేదు. ఫెన్సింగ్ రాళ్లు కొంతమేరకు విరగొట్టి కింద పడేసి చేతులు దులుపుకున్నారు. ఆక్రమించింది ఎవరు అనే విషయాన్ని విచారించి ఆక్రమణదారులపై కనీసం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడం అధికారుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని రైతులు పేర్కొంటున్నారు.






