తెలంగాణలో బోనాల జాతర ప్రారంభం.. భక్తజన సందోహంగా గోల్కొండ

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-16 07:10:34  IST  )

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

తెలంగాణలో బోనాల జాతర ప్రారంభం.. భక్తజన సందోహంగా గోల్కొండ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా, మొదటి బోనాన్ని గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక అమ్మవారికి కుమ్మరులు సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా 11 బోనాలతో కోటకు చేరుకున్న భక్తులు అమ్మవారికి ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి బంగారు బోనాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని వారు ఆకాంక్షించారు.


తొలి బోనం సమర్పణతో గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ భక్తుల కోలాహలంతో, శోభాయమానంగా మారాయి. జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, తాగునీరు, భారీ భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను సైతం కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కోట వైపు వచ్చే దారులన్నీ భక్తజన సందోహంగా మారడంతో గోల్కొండ పరిసరాలు ఆధ్యాత్మిక ఉట్టిపడేలా కనిపిస్తున్నాయి.




Next Story