- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణదేవుడి కోసం ‘కప్పతల్లి ఆట’.. చెరువుల వద్ద ప్రత్యేక పూజలు
నెల 15 రోజులు కావస్తున్నప్పటికీ వర్షాలు ముఖం చాటేస్తున్నాయి.

దిశ,చిన్నశంకరంపేట: నెల 15 రోజులు కావస్తున్నప్పటికీ వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. రోహిణి కార్తె నుంచి ఆరుద్ర కార్తె వరకు ఆశించిన వర్షాలు పడకపోవడంతో చిరుజల్లులైన కురవకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో వరుణ దేవుని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాలలో ఆడే సాంప్రదాయ ఆట "కప్పతల్లి ఆట". అలాగే గ్రామాలలో ఆంజనేయస్వామి, ఆలయాలలోనూ, చెరువులోనున్న, బంకమట్టిని తీసుకువచ్చి చుట్టూ గోడలాగా పెట్టి బిందెలతో మహిళలు నీరు నింపి వానమ్మా వానమ్మా ఒక్కసారి వచ్చిపోవా అంటూ వరుణ దేవుడిని ఆటపాటలతో కొలుస్తున్నారు. తెలంగాణలోని పల్లెలలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. వర్షం కోసం రైతన్నలు ప్రజలు ఆకాశం వైపు ఎంత చూచిన వర్షాలు పడడం లేదు. దీంతో ప్రజలు చెరువుల వద్దకు వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు చిన్న శంకరంపేటలో కట్టెకు కోండ్రు కప్ప వేపాకులపై ఉంచి పసుపు, కుంకుమ, వేసి ఇంటింటికి తిప్పుతూ, బిందెల నుండి బయలు నీళ్లు తెచ్చి పోస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలో ఈ కప్పతల్లి ఆట ఆడుతూ వరుణ దేవుని వేడుకుంటున్నారు.






