ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ బీఎల్‌ఏల చురుకైన భాగస్వామ్యం

by Ratna Kumari |

మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు చురుకుగా పాల్గొంటున్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ బీఎల్‌ఏల చురుకైన భాగస్వామ్యం
X

దిశ, మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు చురుకుగా పాల్గొంటున్నారు. బీఎల్‌వోలు భార్గవి, మణెమ్మ, మౌనిక, గ్రామ పంచాయతీ కార్యదర్శి వి.శ్యామ్‌తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు ఎస్‌ఐఆర్ ఫారాలను నింపించడంలో సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఫారాల ప్రాధాన్యతను వివరించడంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలపై అవగాహన కల్పిస్తూ, ఫారాలను సక్రమంగా నింపేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఫారాల సేకరణను వేగవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఎల్‌ఏలు ఈసా బస్రవి, జి.లక్ష్మీకాంత్ రెడ్డి బీఎల్‌వోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శితో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేస్తున్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story