ఉత్కంఠ ఫలితాలు.. 4 ఓట్ల తేడాతో గెలుపు

by Muthe.Rajitha |   (  Updated:2025-12-11 11:07:10  IST  )

సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో విలువైంది.

ఉత్కంఠ ఫలితాలు.. 4 ఓట్ల తేడాతో గెలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో విలువైంది. ఒక్కోసారి ఒకటీ రెండు ఓట్ల తేడాతోనే గెలుపు తారుమారు అవుతుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠతకు దారి తీసింది. చివరికి అభ్యర్థి పి. స్రవంతి కేవలం 4 ఓట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. అలాగే ఇలాంటి ఘటన మరోచోట కూడా జరిగింది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం ర్యాగట్లపల్లిలో భాగ్యమ్మ అనే సర్పంచ్ అభ్యర్థి 5 ఓట్లతో గెలుపొందింది. ఇలా అనేక చోట్ల ఒక్కొక్క ఓటు అభ్యర్థుల భవితవ్యాన్ని తెలుస్తోంది.

Read More... 9 ఓట్లతో సర్పంచ్‌గా విజయం

Sarpanch Elections: ఈటల అభ్యర్థిపై.. బండి సంజయ్ అభ్యర్థి గెలుపు

Next Story