- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sarpanch Elections: ఈటల అభ్యర్థిపై.. బండి సంజయ్ అభ్యర్థి గెలుపు
Sarpanch Elections: ఈటల అభ్యర్థిపై.. బండి సంజయ్ అభ్యర్థి గెలుపు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోణీ కొట్టింది. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్(బండి సంజయ్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి) 90 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం ర్యాకం శ్రీనివాస్ కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ మరో అభ్యర్థి(ర్యాకం సంపత్) పోటీలో పెట్టగా ఓటమి పాలయ్యారు. ఉప్పలపల్లిలో మూడు, నాలుగు స్థానాలకే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పరిమితం కావడం గమనార్హం. భీమదేవరపల్లి మండలం రసూల్ పురాలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి మహేశ్ విజయం సాధించారు.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ముగిసింది. 3,834 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు.






