ఓడలరేవు వద్ద విషాదం.. సముద్రంలో ముగ్గురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-19 13:32:38  IST  )

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు వద్ద విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానికి వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. ..

ఓడలరేవు వద్ద విషాదం.. సముద్రంలో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) ఓడలరేవు(Odalarevu) వద్ద విషాదం(Tragedy) చోటు చేసుకుంది. సముద్ర స్నానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందారు. అంబాజీ‌పేటకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం కావడంతో సరదాగా స్నానం చేసేందుకు ముగ్గురు యువకులు ఓడలరేవు వద్ద సముద్రం వద్దకు వెళ్లారు. నీటిలోకి దిగి సరదాగా ఈతకొడుతుండగా ఒక్కసారి పెద్ద అల వచ్చింది. దీని దాటికి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నీటిలో కొట్టుకుపోయారు.

ముగ్గురి మృతదేహాలు లభ్యం..

ఈ విషయం తెలుసుకున్న మెరైన్, రెస్క్యూ పోలీసులు సముద్రంలో గాలించారు. ముగ్గురు యువకుల మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు మంచాల శ్రీరామ్, మంచాల సాయి, సూదా అరవింద్‌గా గుర్తించారు. బిళ్లకుర్రు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా పని చేస్తున్నారని సూదా అరవింద్‌తో పాటు మరో 8 మంది సముద్ర స్నానానికి వచ్చారు. అయితే వీరిలో శ్రీరామ్, సాయి, అరవింద్ సముద్రంలోకి దిగిన సమయంలో ఘటన జరిగింది.

Next Story