- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి సినిమాలో మరో సీనియర్ హీరో..!
చిరంజీవి - బాబీ దర్శకత్వంలో వస్తోన్న కొత్త సినిమాలో మరో సీనియర్ హీరో ఉన్నట్లు టాక్.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఏడాదికి ఒక్కటైనా రిలీజ్ చేసి, ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తున్నాడు. మొన్నటి సంక్రాంతి సమయంలో మన శంకర వరప్రసాద్ గారు మూవీతో బంపర్ హిట్ అందుకున్న చిరంజీవి.. అదే ఊపులో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి కాకాజీ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారట. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇలాంటి క్రమంలో ఈ సినిమా నుంచి మరో అప్డేట్ బయటకు వచ్చింది. చిరంజీవి నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరో శరత్ కుమార్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారట. ఆయన పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. దాంతో పాటు ఓ నెగటివ్ రోల్ కూడా సినిమాకు హైప్ ఇవ్వనుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా కేవీఎన్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా రానుండగా.. 2027 సంక్రాంతి కానుకగా థియేటర్ లలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీలో చిరంజీవి భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. నివేదా పేతురాజ్, రచిత , అనేశ్వర రాజన్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారు.






