ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. గదిలో నాటు తుపాకీ, మూడు రౌండ్స్ లభ్యం

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-20 02:59:00  IST  )

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పొలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. గదిలో నాటు తుపాకీ, మూడు రౌండ్స్ లభ్యం
X

దిశ, దుండిగల్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పొలీస్ స్టేషన్‌లో జరుగగా మృతుని ఇంట్లో నాటు తుపాకీ, మూడు రౌండ్స్ దొరకడం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లాకు చెందిన తూముటి వెంకట్రావ్(36) ప్రణీత ప్రణవ్ నిర్మాణ సంస్థలో పని చేస్తూ మల్లంపేటలోని శ్రీ బాలాజీ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం వివాహం కాగా అతనికి ఒక కూతురు ఉంది. కుటుంబ కలహాలతో భార్య భర్తలు రెండు సంవత్సరాలు గా వేరుగా ఉంటున్నారు.

రెండు సంవత్సరాలుగా తను ఒక్కడే ఉండడంతో ఇటీవల తన తమ్ముడు రాము కుటుంబాన్ని ఒంగోలు నుండి పిలిపించుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఎంతకు డోర్ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన తమ్ముడు రాము కిటికీలోనుంచి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించాడు. తలుపులు పగలగొట్టి వెంటనే 100 డయల్‌కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గదిలోని ఓ బ్యాగ్‌లో తుప్పు పట్టిన నాటు తుపాకీ, మూడు రౌండ్స్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

మృతుడి గదిలో నాటు తుపాకీ మూడు రౌండ్స్ లభ్యం..

మల్లంపేటలోని శ్రీ బాలాజీ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న మృతుడు వెంకట్రావు ఇంట్లో తుప్పు పట్టిన నాటు తుపాకీ,మూడు లైవ్ రౌండ్స్ దొరకడం కలకలం రేపుతోంది. ఈ సంఘటనలో ఆత్మహత్యతో పాటు ఆయుధం అతని దగ్గరకు ఎలా వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాని వెనుక ఏదైనా ఇతర కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం ఉన్న నాటు తుపాకీ లభించడం కేసుకు అదనపు ప్రాధాన్యత తీసుకు వచ్చింది.

Next Story