డీఎంహెచ్‌వో వర్సెస్ స్టాఫ్‌.. జిల్లా వైద్యారోగ్య శాఖలో తీవ్రమవుతున్న వార్‌

by Jakkula.Mamatha |

జిల్లా వైద్యారోగ్య శాఖలో డీఎంహెచ్‌వో కు కొంత మంది స్టాఫ్‌ కు మధ్య కొంతకాలంగా ‘వార్‌’ నడుస్తోంది.

డీఎంహెచ్‌వో వర్సెస్ స్టాఫ్‌.. జిల్లా వైద్యారోగ్య శాఖలో తీవ్రమవుతున్న వార్‌
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లా వైద్యారోగ్య శాఖలో డీఎంహెచ్‌వో కు కొంత మంది స్టాఫ్‌ కు మధ్య కొంతకాలంగా ‘వార్‌’ నడుస్తోంది. డిఎంహెచ్‌వో నియంతృత్వ అరాచకాలను భరించలేక పోతున్నామం టూ స్టాఫ్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమెతో కలిసి పని చేయలేమంటూ టిఎన్జీవో ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. అయితే నిక్కచ్చి గా వ్యవహరించడం వల్లనే తనపై ఫిర్యాదులు చేస్తున్నారంటూ డీఎం హెచ్‌వో స్వర్ణ కుమారి చెబుతున్నా రు. రోజురోజుకూ సమస్య మరింత తీవ్రతరం కావడంతో ఈ పంచాయితీకి ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు ఎటువం టి చర్యలు తీసుకుంటారో! అనేది చర్చనీయాంశంగా మారింది.

ఫిర్యాదు ఏంటంటే..

డీఎంహెచ్‌వోపై చేసిన ఫిర్యాదులో స్టాఫ్‌ పలు అంశాలను ప్రస్తావించా రు. వేలితో గుచ్చడం, ష్‌.. అంటూ నోరు మూయించడం, గెట్‌ ఔట్‌ మై ఛాంబర్‌, నోర్మూసుకో.. నువ్వు మనిషివి కాదు.. వంటి ధూషణలతో డీఎంహెచ్‌వో అవమానకరంగా మాట్లాడుతోందని ఫిర్యాదులో ఆరోపించారు. డీపీఎంయూ సిబ్బందిని గంటల తరబడి తన ఛాంబర్‌ ఎదు ట నిలబెట్టడంతో పాటు ఇతరుల ముందు అవమానించడం నిత్యకృత్యంగా మారిందని పేర్కొన్నారు. సి బ్బంది జీతాలు, ఇతర బిల్లులు అన్నీ ఆగిపోయాయని, కొండాపూర్‌ ల్యాబ్‌ కూడా మూతబడిందని ఫిర్యా దులో ప్రస్తావించారు. డీఎంహెచ్‌వో టార్చర్‌‌తో నందిగా మ మెడికల్‌ ఆఫీసర్‌ మానసిక ఒత్తి డికి గురై ఉద్యోగానికి రాజీనామా చేశారని, పీహెచ్‌సీ దండు మైలా రం మెడికల్‌ ఆఫీసర్‌ లాంగ్‌ లీవ్‌ పెట్టి వెళ్లిపోయారని ఫిర్యాదు చేశా రు. వెంటనే డీఎంహెచ్‌వోను బదిలీ చేయాలని ఫిర్యాదులో కోరారు. ఆ దివారం మినిస్టర్స్​‍ క్వార్టర్స్​‍లో టీఎ న్జీవో సెంట్రల్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. హెల్త్ సెక్రటరీకి ఫోన్‌ చేసి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు స్టాఫ్‌ చెబుతున్నారు.

ఖండించిన డీఎంహెచ్‌వో

స్టాఫ్‌ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలను డీఎం హెచ్‌వో స్వర్ణ కుమారి ఖండించారు. ఫీల్డ్​‍ విజిట్‌ చేయడం, విధులను సక్రమంగా నిర్వర్తించాలని నిక్కచ్చిగా చెబుతుండడంతో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను రంగారెడ్డి జిల్లాకు రాకముందే నందిగా మ మెడికల్‌ ఆఫీసర్‌ రాజీ నామా చేశారని, దండు మైలా రం మెడికల్‌ ఆఫీసర్‌ లాంగ్‌ లీవ్‌ పెట్టడానికి తాను బాధ్యురాలిని కాదన్నారు. అనారోగ్య సమస్యల వల్లనే ఆమె లాంగ్‌ లీవ్‌ పెట్టారని తెలిపారు.

Next Story