- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మపురి క్షేత్రంలో చేపట్టిన వరుణ యాగంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి..
పాడిపంటలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడు వరుణదేవ అంటూ ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వరుణ యాగం నిర్వహించారు.

దిశ, ధర్మపురి: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు కురిపించి పాడిపంటలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడు వరుణదేవ అంటూ ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురియాలని ధర్మపురి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. వరుణదేవ కరుణించి వర్షాలు కురిపించు రాష్టం సుభిక్షంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కూడా అదే అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ధర్మపురి క్షేత్రంలో వర్షాల కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన ఆలయ సిబ్బందికి అర్చకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.






