9 ఓట్లతో సర్పంచ్‌గా విజయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-11 11:05:18  IST  )

9 ఓట్లతో సర్పంచ్‌గా విజయం

9 ఓట్లతో సర్పంచ్‌గా విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల(Telangana Sarpanch Elections) పోలింగ్ ముగిసింది. తాజాగా ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండగా.. మరికొన్ని చోట్ల స్వల్ప ఓట్ల వ్యవధితో కొందరు అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో బీఆర్ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో గెలిచారు. అటు జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ లోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించారు. కాగా, తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు.

Read More... ఉత్కంఠ ఫలితాలు.. 4 ఓట్ల తేడాతో గెలుపు

Next Story