- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన దుండగులు
డంపింగ్ యార్డు సమీప అటవీ భూమిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల గ్రామపంచాయతీ పరిధిలోని డంపింగ్ యార్డు సమీప అటవీ భూమిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం నిధులతో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల మొక్కలు నాటే లక్ష్యంతో గత వారం రోజులుగా ప్లాంటేషన్ పనులు చేపట్టారు. కూలీలతో గుంతలు తవ్వించి, గ్రామ సర్పంచ్ గడ్డం బాబాయి నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి నరేష్, గ్రామస్తుల సహకారంతో ఈ నెల 14న లింగంపేట మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సురేందర్ చేత మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు శ్రమించి సుమారు వెయ్యి మొక్కలు నాటగా, వర్షాలు కురిసిన వెంటనే మరో వెయ్యి మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
350 మొక్కలు ధ్వంసం..
అయితే మొక్కలు నాటిన మూడు రోజులకే సుమారు 350 మొక్కలను కేజీవీల్ ట్రాక్టర్ సాయంతో రాత్రి సమయంలో ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. పర్మల్ల మాలోత్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఆగపల్లి తండాకు చెందిన కొందరు ఈ ఘటనకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించగా తనపై దాడికి కూడా యత్నించారని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ *లక్ష్మణ్ తెలిపారు. అటవీ భూములను ఆక్రమించుకునే ఉద్దేశంతోనే ప్లాంటేషన్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
విచారణ అనంతరం చర్యలు..
ఈ ఘటనపై ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారి రమేష్ ను వివరణ కోరగా, ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన భూమి అటవీ శాఖ పరిధిలో ఉందా లేదా అన్న అంశంపై ముందుగా విచారణ చేపడతామని తెలిపారు. విచారణలో వాస్తవాలు తేలితే మొక్కలను ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.






