- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలి.. మానవ హక్కుల కమిషన్ ఆదేశం
విద్యా సంస్థలలో నెలకొన్న పరిస్థితులపై బీసీదల జాతీయ అధ్యక్షుడు కుమారస్వామి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు.

దిశ, శేరిలింగంపల్లి: జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTBCWREIS) ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలలో నెలకొన్న పరిస్థితులపై బీసీదల జాతీయ అధ్యక్షుడు కుమారస్వామి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సమగ్ర నివేదిక అందజేశారు. ఈ అంశం పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా పరిగణించింది. సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించాలని గురుకుల పాఠశాల కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలలో విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యత, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు తండ్రి కుమారస్వామి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించారు.
సొసైటీ కార్యదర్శికి నోటీసు జారీ..
ఆయన ఫిర్యాదు మేరకు, బీసీ సంక్షేమ విద్యా సంస్థల నుండి నివేదికను హెచ్‌ఆర్‌సి కోరింది.గురుకుల విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, భద్రత, జీవన స్థితిగతులపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ ఫిర్యాదును హెచ్.ఆర్. కేసు నంబర్ 2825/2026గా నమోదు చేసిన కమిషన్, పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై సమగ్ర నివేదికను కోరుతూ సొసైటీ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 18న ఉదయం 11 గంటలకు ఈ విషయంపై కమిషన్ తదుపరి పరిశీలన జరపనున్నందున, అంతకంటే ముందే ఈ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. హెచ్ఆర్సి ముందు ఉంచిన ఆరోపణలు సంబంధిత వాస్తవాలను వివరిస్తూ సమగ్ర నివేదికను అందించాలని కమిషన్ సంబంధిత అధికారిని ఆదేశించింది. నోటీసు అందుకున్న అధికారి మాత్రమే ఈ సమాచారాన్ని సమర్పించాలని కూడా కమిషన్ స్పష్టం చేసింది.






