- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

దిశ, కొమురవెల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రయివేటు గదులు, దేవాలయ సత్రాలలో రాత్రి బస చేసి ఆదివారం వేకువజామున లేచి కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులు పట్నాలు,బోనాలు, అర్చనలు,అభిషేకం,నిత్య కళ్యాణం,తిరుగుడుకోడే, తలనీలాలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైవున్న రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో త్రాగునీరు,,మరుగుదొడ్లు కనీస మౌలిక వసతులు లేకపోవడంతో అధికారుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఆలయ ఈ ఓ కట్ట సుధాకర్ రెడ్డి ఏ.ఈ.ఓ బుద్ది శ్రీనివాస్,ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్,సూపరిండెంటెంట్ నీలా శేఖర్, అర్చకులు,సిబ్బంది భక్తులకు సేవలాందించారు.
అన్నప్రసాద వితరణ శాలకు భక్తుడి విరాళం
మల్లికార్జున స్వామి క్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్, చైతన్యపురి కి చెందిన మర్రిరెడ్డి రాఘవ రెడ్డి కవిత దంపతులు అన్నదాన స్కీం నందు విరాళంగా(1,00116) 1లక్ష,ఒక వంద, పదహారు రూపాయలు చెల్లించారు.ఈ మేరకు ఆలయ పర్యవేక్షకులు నీలా శేఖర్ వారికి తగు రసీదు తో పాటు స్వామి వారి శేష వస్త్రాములు,తీర్ధ ప్రసాదాలు అందజేశారు.






