- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేతల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు
బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో రాజకీయ పార్టీల నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు

దిశ, శంషాబాద్: బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో రాజకీయ పార్టీల నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఆదివారం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బహదూర్‌గూడ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల క్రితమే రైతులతో చర్చించారని తెలిపారు. అనంతరం కలెక్టర్ సమక్షంలో రైతులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, మొత్తం 1,300 ఎకరాల భూమిలో 600 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. మిగిలిన భూములకు సంబంధించిన రైతులకు ఒక్కొక్కరికి 500 గజాల స్థలం ఇవ్వాలని ప్రతిపాదించగా, రైతులు మరింత ఎక్కువగా కోరారని తెలిపారు. అనంతరం కలెక్టర్‌తో జరిగిన చర్చల్లో రైతులు అంగీకరించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాల వద్ద రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరినా ఎవరూ స్పందించలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, ప్రతి రైతుకు 600 గజాల స్థలం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఇప్పుడు రాజకియం చేస్తుండ్రు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూముల విషయంలో ఏమీ చేయలేమని చెప్పిన వారు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. రైతులు అలాంటి మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.






