- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీశ్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న వంటేరు వీడియో
హరీశ్ రావుపై ఎమ్మెల్సీ కవిత అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో వంటేరు ప్రతాప్ రెడ్డి వీడియో వైరల్ అవుతోంది...

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావుపై ఎమ్మెల్సీ కవిత అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే 2018 ఎన్నికల సమయానికి సంబంధించి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనకు హరీశ్ రావు ఫోన్ చేశారని, కేసీఆర్‌ని ఓడించాలని చెప్పారని తెలిపారు. ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తం చూసుకుంటానని, అంతేకాకుండా అన్ని విధాలుగా అండగా ఉంటానని, కేసీఆర్ ఓడిపోతే అంత మనదేనని తనకు ఫోన్‌లో హరీశ్ రావు చెప్పారని ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారంలో వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. హరీశ్ రావు తనకు ఫోన్ చేసిన విషయంపై తాను ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తానని అప్పట్లోనే వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు.
అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2018 ఎన్నికల అనంతరం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో సంక్షేభం ముదిరిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల కారణంగా గతంలో పలువురు నేతలు మాట్లాడిన వీడియోలు, ఆడియోలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలపై విమర్శల హస్త్రంగా కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి వీడియో కూడా అలాంటిదేనని పలువురు బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.
Read More..
Kavitha: బీఆర్ఎస్ కు కౌంటర్ ప్లాన్.. రేపు మీడియా ముందు కవిత సంచలన ప్రకటన
కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హరీష్ రావు, మాజీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ దహనం






