కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-02 12:06:01  IST  )

బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కవిత (Kavitha) సస్పెన్షన్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics)ను కుదిపేస్తోంది.

కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో/జడ్చర్ల: బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కవిత (Kavitha) సస్పెన్షన్ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics)ను కుదిపేస్తోంది. ప్రస్తుతం ఆమె కొత్త పార్టీ పెడతారా..? లేక మరేదైనా పార్టీలో చేరుతారా.. అనే ప్రచారం అటు జాగృతి నేతలతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్లో సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు కవిత సొంత పార్టీపై ఎన్ని విమర్శలు చేసినా.. చర్యలు తీసుకోలేదని అన్నారు. కేవలం కాళేశ్వరంపై నోరు జారినందుకే పార్టీ నుంచి బహిష్కరించారని తెలిపారు. ఇక్కడే అసలు నిజం బయటపడిందని.. కాళేశ్వరం‌ (Kaleshwaram)లో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే విషయం స్పష్టమైందని కామెంట్ చేశారు. ఒకవేళ కవిత కాంగ్రెస్ చేరేందుకు మొగ్గు చూపితే.. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని అన్నారు. తండ్రి పెట్టిన పార్టీనే నాశనం చేసిందంటే.. రేపు తమ పార్టీని కూడా గంగలో కలిపేస్తోందని సెటైర్లు వేశారు.

Read More..

Kavitha: బీఆర్ఎస్ కు కౌంటర్ ప్లాన్.. రేపు మీడియా ముందు కవిత సంచలన ప్రకటన

కేసీఆర్‌ని ఓడించమని హరీష్‌‌రావు ఫోన్.. కుట్ర బయటపెట్టిన వంటేరు

Next Story