హరీష్ రావు, మాజీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ దహనం

by Kodari Anjali |   (  Updated:2025-09-02 13:34:46  IST  )

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత ఫ్లెక్సీని మల్లె చెట్టు చౌరస్తాలో దహనం చేశారు.

హరీష్ రావు, మాజీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ దహనం
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత ఫ్లెక్సీని మల్లె చెట్టు చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కవిత బీజేపీ పార్టీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు. తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడం కోసం బీఆర్ఎస్ లో ఉన్న నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ అనే విషయం కవిత గుర్తుంచుకోవాలన్నారు. కన్నతల్లి లాంటి పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే కవితను ఊళ్ళల్లో తిరగనీయకుండా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More..

హరీశ్‌‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న వంటేరు వీడియో

+

Next Story