- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లారెడ్డిలో కార్డెన్ సెర్చ్.. 135 వాహనాలు సీజ్
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

దిశ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఎర్రమనుకుచ్చ, బీసీ కాలనీల్లో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు తనిఖీలు నిర్వహించాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి పోలీసులు హడావుడి చేయడంతో ఏం జరిగిందోనని ప్రజలు అయోమయానికి గురయ్యారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 135 బైక్లు, 8 ఆటోలు, కార్లు ఇతర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సరైన పత్రాలు తీసుకొచ్చి వాహనాలను తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించారు. చోరీ చేసిన వాహనాలతో కొందరు వ్యక్తులు చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఎస్ నగర్ సీఐ, సబ్ డివిజన్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






