- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీహెచ్ తయారీ కేంద్రాన్ని గుర్తించిన ఎక్సైజ్ ఈగల్ టీం
కల్లు తయారీలోకి ఉపయోగించే నిషేధిత సీహెచ్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ ఎక్సైజ్ ఈగల్ టీం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కన ఒక గదిలో పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో / భూత్పూర్ : కల్లు తయారీలోకి ఉపయోగించే నిషేధిత సీహెచ్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ ఎక్సైజ్ ఈగల్ టీం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కన ఒక గదిలో పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అడ్డాకుల మండలానికి చెందిన ఒక వ్యక్తి సీహెచ్ తయారీకి సంబంధించిన యంత్రాలు, ఇతర సామాగ్రి తెప్పించి కొంతమంది నమ్మకస్తులైన కూలీలను పెట్టుకుని సీహెచ్ ను తయారు చేస్తూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇతర జిల్లాలలో సీహెచ్ తో ఎక్సైజ్ అధికారులకు పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఈగల్ టీం సభ్యులు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో సీహెచ్ తయారీ కేంద్రం పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. యంత్రాలను ఉపయోగించి సిహెచ్ తయారు చేస్తూ.. వాటిని ప్యాకింగ్ చేస్తూ ఉన్న దృశ్యాలను చూసి ఎక్సైజ్ ఈగల్ టీం సంబంధితలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తెల్లవారుజామున రెండు గంటల నుండి ఈ సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది. ఈ సీహెచ్ తయారీ వెనుక ఎవరెవరు ఉన్నారు..? ఇక్కడ తయారీ అయిన సిహెచ్ ను రాష్ట్రంలోని ఏ ఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు తదితర వివరాలను సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






