- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
26 ఏళ్లు దాటిన మహిళలకు బిగ్ అలర్ట్.. వైద్యుల కీలక సూచనలు
26 ఏళ్లు దాటిన మహిళలకు వైద్యులు కీలక సూచలను చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: శరీరంలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా ప్రతి మహిళ జీవితంలో కనీసం ఒక్కసారైనా అతి ముఖ్యమైన ‘పాప్ స్మెర్’ టెస్ట్ చేయించుకోవాలని వైద్యుల సూచిస్తున్నారు. అయితే, ఈ పరీక్ష ప్రధానంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) వచ్చే అవకాశాలను ముందస్తుగా గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గర్భాశయ ముఖద్వారంలోని కణాల్లో జరిగే అసాధారణ మార్పులను ఈ పరీక్ష ద్వారా దాదాపు 10 సంవత్సరాల ముందే పసిగట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంటే క్యాన్సర్ ముదిరి ప్రాణాంతకం కాకముందే, ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందడం ద్వారా దాని నుంచి పూర్తి రక్షణ పొందవచ్చు.
టెస్ట్ ఎవరు చేయించుకోవాలి..
సాధారణంగా 26 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలందరూ ‘పాప్ స్మెర్’ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది చాలా సులువైన, కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తయ్యే సాధారణ ఓపీ (OPD) పరీక్ష. గైనకాలజిస్ట్ ఒక చిన్న బ్రష్ లేదా స్పూన్ వంటి పరికరం సహాయంతో గర్భాశయ ముఖ ద్వారం (Cervix) నుంచి కొన్ని కణాలను (Cells) సేకరించి, ల్యాబ్‌లో మైక్రోస్కోప్ ద్వారా పరీక్షకు పంపుతారు. ఈ పరీక్ష సమయంలో పెద్దగా నొప్పి ఉండదు, చిన్న అసౌకర్యం మాత్రమే ఉంటుంది. ఇలా పాప్ స్మెర్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదాలను ముందే నివారించవచ్చని చెబుతున్నారు.






