- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ వెబ్‌డెస్క్: కాకతీయులు పాలించిన నగరం వరంగల్‌లో వెలసిన భక్తుల కొంగుబంగారం శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం అమ్మవారు భక్తులకు అత్యంత శక్తివంతమైన ‘విరోధిని’ అలంకారంలో దర్శనమిచ్చారు. భీకర రూపంలో, శత్రు వినాశకారిణిగా ముస్తాబైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తజనం ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం ‘జై భద్రకాళి’ నామస్మరణలో కిటకిటలాడుతోంది. అదేవిధంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లుగా ఆలయ ఈవో తెలిపారు.
Next Story






